Kargil Vijay Diwas : ఘనంగా కార్గిల్ విజయ్ దివస్..!
దేశ వ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్గిల్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.;
దేశ వ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్గిల్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఢిల్లీలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు. 1999లో కాశ్మీర్‌లోని కార్గిల్‌ను దురాక్రమణ చేసిన పాకిస్థాన్ ఆర్మీపై భారత సైన్యం వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. పాక్ సైన్యాన్ని ఓడించి కార్గిల్ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆపరేషన్ విజయ్ విజయవంతమైనట్లు 1999 జూలై 26న భారత్ అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటోంది భారత్.