ఆసుపత్రిలో చేరిన మెగాస్టార్ అల్లుడు.. !
సామాన్యులతో పాటుగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా చిరంజీవి చిన్నల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్ కూడా కరోనా బారిన పడ్డాడు;
కరోనా సెకండ్ వేవ్ మాములుగా లేదు.. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటుగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా చిరంజీవి చిన్నల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్నీ కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాన్నట్లుగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తానూ కోలుకోవాలని కోరుకున్నవారందరికి ధన్యవాదాలు తెలిపాడు. అటు నటుడు నాగబాబు.. కల్యాణ్‌దేవ్ పోస్ట్‌పై స్పందిస్తూ.. త్వరగా కోలుకుంటావనే నమ్మకం, గెట్ వెల్ సూన్ మై బాయ్ అంటూ కామెంట్ చేశారు.