Actor Nandu: న్యూడ్ ఫోటోషూట్ ట్రెండ్‌లో టాలీవుడ్ హీరో..

Actor Nandu: ఓ మ్యాగజిన్ కోసం రణవీర్ న్యూడ్‌గా ఫోటోషూట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Update: 2022-07-26 05:15 GMT

Actor Nandu: రణవీర్ సింగ్ చేసిన ఒక్క ఫోటోషూట్ ఇంత దుమారాన్ని సృష్టిస్తుందని తను కూడా ఊహించి ఉండడు. హీరోయిన్లు మాత్రమే ఎందుకు సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోషూట్స్ చేయాలి. హీరోలు ఎందుకు చేయకూడదు అని హీరోలందరికీ పిలుపునిచ్చినట్టుగా ఉంది రణవీర్ ఫోటోషూట్. అది నచ్చే చాలామంది యంగ్ హీరోలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఈ ట్రెండ్‌లో భాగమయ్యాడు.

ఓ మ్యాగజిన్ కోసం రణవీర్ న్యూడ్‌గా ఫోటోషూట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తను చాలా బోల్డ్ అని కొందరు ప్రశంసిస్తుంటే చాలామంది మాత్రం తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ రణవీర్ మాత్రమే కాదు.. ఇతర హీరోలు కూడా ఈ కామెంట్స్ గురించి పట్టించుకోకుండా న్యూడ్ ఫోటోషూట్స్ ట్రెండ్‌కు ఫిదా అయిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ యాక్టర్ నందు కూడా ఇలాంటి ఫోటోషూట్‌నే చేశాడు.

ఎవరు ఏమనుకుంటే మాకేంటి మేము నచ్చింది చేస్తాం అన్నట్టుగా ఉంది హీరోల వ్యవహారం. అందుకే న్యూడ్ ఫోటోషూట్స్‌కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల సింగర్ గీతా మాధురి భర్త యాక్టర్ నందు కూడా ఓ టవర్ కట్టుకొని ఫోటో దిగాడు. దానికి 'రణవీర్ సింగ్ ట్రెండ్‌లో జాయిన్ అవుతున్నా' అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.


Tags:    

Similar News