నాగబాబు నాకు కనిపించే ప్రత్యక్షదైవం.. ఆయనకు పాదాభివందనం చేస్తా : జయలలిత
నటిగా వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జయలిలిత... ప్రస్తుతం సినిమాలలో అడపాదడపా కనిపిస్తున్న .. సీరియల్స్ తో మాత్రం ఫుల్ బిజీగా ఉంది.;
నటిగా వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జయలిలిత... ప్రస్తుతం సినిమాలలో అడపాదడపా కనిపిస్తున్న .. సీరియల్స్ తో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. ఇదిలావుండగా తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన జయలిలిత.. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఎప్పటినుంచో తనకి స్నేహితులుగా ఉన్న ఒక కుటుంబం సీరియల్స్ నిర్మిస్తూ ఉండేదని, నోట్ల రద్దు సమయంలో పన్నులు కట్టడం ఇబ్బందిగా ఉందని చెప్పి సీరియల్స్ నిర్మించడం కష్టమవుతుందని తన దగ్గర అప్పు తీసుకొని మోసం చేశారని వాపోయింది.
మొత్తం రూ. 4 కోట్ల రూపాయలని లాగేసుకున్నారని, ఇవ్వమని అడిగితే తప్పించుకొని తిరుగుతున్నారని... వాళ్ళు కరడుగట్టిన మోసగాళ్లు అంటూ చెప్పుకొచ్చింది. ఎన్నో లగ్జరీ కార్లలో తిరిగిన తానూ.. ఇప్పుడు షూటింగ్ లకి క్యాబ్‌లలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమోషనల్ అయ్యారు.
తాను ఇలా మోసపోయిన తెలుసుకొని నటుడు నాగబాబు.. ఒకరోజు తనని ఇంటికి పిలిపించి ధైర్యం చెప్పారని, బ్యాంక్ అకౌంట్ నంబరు తీసుకుని అవసరానికి డబ్బులు పంపేవారని చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ టైంలోనే కాకుండా ఎన్నో సార్లు నన్ను ఆదుకున్నారని, ఆయనకు పాదాభివందనం చేస్తానని జయలలిత మోషనల్ అయ్యారు.
బావా.. నాకేదైనా సినిమాల్లో పాత్రలు ఇప్పించండని స్వతంత్రంగా నాగబాబును అడిగేస్తానని జయలలిత చెప్పుకొచ్చారు. అలాగే చలపతిరావు బాబాయి, రామానాయుడుగారు తనకి ఆర్థికంగా ఎంతో సహాయం చేసేవారని తెలిపింది.