pranitha subhash : బాపు గారి బొమ్మ ప్రణీతకి పెళ్లి అయిపొయింది..!
pranitha subhash : అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత సుభాష్ సిక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆదివారం నితిన్ రాజ్ అనే బిజినెస్ మెన్ ని వివాహం చేసుకుంది.;
pranitha subhash : అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత సుభాష్ సిక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆదివారం నితిన్ రాజ్ అనే బిజినెస్ మెన్ ని వివాహం చేసుకుంది ఈ బాపు బొమ్మ.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సమక్షంలో చాలా సింపుల్ గా ఈ వివాహం జరిగింది. చాలా రోజులుగా నితిన్ రాజ్ తో ప్రేమలో ఉన్న ప్రణీత.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత... ఆతర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.