Sai Pallavi Rejected Movies : అలా అయిదు కోట్లు పోగొట్టుకున్న సాయిపల్లవి...!

Sai Pallavi Rejected Movies : పారితోషికం కంటే పాత్రలే ఇంపార్టెంట్ అనుకుంటూ ముందుకు వెళ్తుంది మలయాళీ భామ సాయిపల్లవి.

Update: 2021-05-16 13:24 GMT

Sai Pallavi Rejected Movies : పారితోషికం కంటే పాత్రలే ఇంపార్టెంట్ అనుకుంటూ ముందుకు వెళ్తుంది మలయాళీ భామ సాయిపల్లవి. చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తోంది సాయి పల్లవి. అలా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులకి గుర్తుండిపోయే పాత్రలు చేసింది ఈ ఫిదా భామ. అయితే గత మూడేళ్లలో సాయి పల్లవి రూ.ఐదు కోట్లు నష్టపోయిందట.

అది ఎలా అంటే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది సాయి పల్లవి. ఈ సినిమా తర్వాత ఆమెకి చాలా ఆఫర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి సినిమాని ఒప్పుకోకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి నాలుగు పెద్ద చిత్రాలను తిరస్కరించిందట.


విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో ముందుగా హీరోయిన్ గా సాయి పల్లవి అనుకున్నారట.. కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆ ఆఫర్ ని సాయి పల్లవి వదులుకుందట.. ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో కూడా మొదటగా హీరోయిన్ గా సాయి పల్లవి అనుకున్నాడట దర్శకుడు.. కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆ అవకాశాన్ని కూడా వదులుకుందట.

అలాగే.. అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాదన్(రీమేక్) వంటి సినిమాలను కూడా రిజెక్ట్ చేసిందట. వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్‌ యాడ్స్‌ని కూడా వదులుకుందట.. అయితే వీటి విలువ దాదాపు రూ.5 కోట్ల పైనే ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం, లవ్ స్టొరీ చిత్రాలను చేస్తోంది. 

Tags:    

Similar News