Samantha : విచారంగా సమంత.. కొత్త మూవీ అనౌన్స్ చేసింది..!
Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత తమ రిలేషన్‌కి బ్రేకప్ చేపినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.;
Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత తమ రిలేషన్‌కి బ్రేకప్ చేపినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చైతో విడిపోయిన తర్వాత సమంత ఏం చేయనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సామ్ సినిమాల పైన ఫోకస్ పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాని ఫినిష్ చేసిన సామ్.. తమిళ్‌లో మరో సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉంది.
తాజాగా దసరా సందర్భంగా మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసింది సామ్. తన తదుపరి చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేస్తోంది. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కొద్దిసేపటి క్రితమే వెల్లడైంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేయగా ఇందులో సామ్ విచారంగా కనిపిస్తోంది.
ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. సినిమాకి సంబంధించిన మరిన్నీ విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.