Akira Nandan: అకీరా పేరులో కొణిదెల లేదు..! తల్లి ఇంటిపేరుతోనే..
Akira Nandan: ఆ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’లోని దోస్తీ పాట ట్యూన్‌ను పియానో వాయించాడు అకీరా.;
Akira Nandan: టాలీవుడ్‌లో ఎక్కువగా హీరోలు పరిచయమయ్యింది మెగా ఫ్యామిలీ నుండే. అయితే ఇప్పటికే సీనియర్ మెగా హీరోల వారసులంతా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ పవన్ కళ్యాణ్ వారసుడివైపే ఉన్నాయి. అకీరా నందన్.. పవన్ వారసుడిగా సినిమాల్లో అడుగుపెడతాడని అనుకున్నారంతా. కానీ ఇంతలోనే ఓ షాకింగ్ విషయం బయటపడింది.
ఇటీవల అకీరా నందన్ తన స్కూలింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తను చదువుతున్న స్కూల్‌లో గ్రాడ్యూయేషన్ డేను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్లడం విశేషం. చాలాకాలం తర్వాత రేణు దేశాయ్‌తో, పిల్లలతో పవన్ కలిసి ఫోటో దిగగా.. అది సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యింది. అంంతే కాకుండా ఆ కార్యక్రమం వీడియో కూడా ఇప్పుడు బయటికొచ్చింది.
ఆ కార్యక్రమంలో 'ఆర్ఆర్ఆర్'లోని దోస్తీ పాట ట్యూన్‌ను పియానో వాయించాడు అకీరా. అయితే ఆ సమయంలో విడుదయిన ఓ వీడియోలో తన పూరు అకీరా నందన్ దేశాయ్ అని కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విడాకులు తీసుకున్నా కూడా అకీరా ఇంటి పేరు కొణిదెల అనే ఉంటుంది కదా అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఈ వీడియోలో ఉంది నిజమో? కాదో? అని పలువురు ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.