Most Eligible Bachelor Twitter Review : అక్కినేని అభిమానులకి పండగే...!
Most Eligible Bachelor Twitter Review : అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్.. అక్కినేని అఖిల్, పూజా హేగ్దే మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు.;
Most Eligible Bachelor Twitter Review : అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్.. అక్కినేని అఖిల్, పూజా హేగ్దే మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు, వాసు వర్మ కలిసి సంయుక్తంగా నిర్మించారు.
పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా నేడు దసరా కానుకగా (అక్టోబర్ 15)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలుచోట్ల సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా బాగుందని చెబుతున్నారు.
ఫస్ట్ హాఫ్ సూపర్ అని, సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని అంటున్నారు. అఖిల్, పూజా సినిమాకి పిల్లర్ లాగా నిలబడ్డారని చెబుతున్నారు. కొందరు లెహరాయి సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. పాట ఎంత బాగుందో సినిమాలో పాటని అద్భుతంగా తెరకెక్కించారని చెబుతున్నారు. అక్కినేని అభిమానులకి ఈ సినిమా పండగేనని అంటున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ టచ్ చేసిన పాయింట్స్ చాలా బాగున్నాయని, ఆలోచింపజేసేలా ఉన్నాయని అంటున్నారు. సినిమాకి సంబంధించిన టోటల్ రివ్యూ మరికాసేపట్లో మీ ముందుకు వస్తోంది.