ఈ అల్లరి నరేష్ హీరోయిన్‌ని గుర్తుపట్టండి చూద్దాం..!
ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం పీరియడ్ వెరీ షార్ట్.. ఫేం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు.;
ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం పీరియడ్ వెరీ షార్ట్.. ఫేం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. కొందరు హీరోయిన్లు ఒక రెండు సినిమాలతో ఫెడ్‌అవుట్ అయిపోతారు. ఆలాంటి జాబితా కిందికే వస్తుంది ఈ అల్లరి నరేష్ హీరోయిన్ శేరిన్ శృంగార్.. ఇంతకీ ఈమె ఎవరనే కదా మీ సందేహం.
అల్లరి నరేష్ హీరోగా, జె. పుల్లారావు దర్శకత్వంలో వచ్చిన జూనియర్స్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు. తెలుగులో కన్నా.. ఈ బ్యూటీ కన్నడ, తమిళ్‌లో ఎక్కువ సినిమాలే చేసింది. సినిమాలు తగ్గుముఖం పట్టడంతో బుల్లితెర వైపు వెళ్ళింది.
ప్రస్తుతం ఐదారు ధారావాహికలలో నటిస్తుంది. ఇక తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 3,4 లో పాల్గొంది ఈ బ్యూటీ.. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటూ అభిమానులను అలరిస్తుంది.