కూతురి యాక్టింగ్ చూసి మురిసిపోయిన అల్లు అర్జున్ దంపతులు..!
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..;
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో 'శాకుంతలం' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో అల్లు అర్జున్-స్నేహ దంపతుల కుమార్తె అల్లు అర్హ కీ రోల్ పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే తమ ముద్దుల కూతురు అర్హ నటనను దగ్గరుండి చూసేందుకు షూటింగ్ సెట్ లోకి వచ్చారు. ఈ క్రమంలో అర్హ నటనని చూసి వారు తెగ మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణాటీమ్ వర్క్స్ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలావుండగా గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గొనా గన్నారెడ్డి అనే పాత్రలో నటించాడు.