Navdeep: నవదీప్‌కు బన్నీ కాస్ట్‌లీ గిఫ్ట్.. సంతోషంతో ఇన్‌స్టాలో షేర్..
Navdeep: సందర్భం లేకుండానే ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌తో నవదీప్‌ను సర్‌ప్రైజ్ చేశాడు బన్నీ.;
Navdeep: సినీ పరిశ్రమలో కొందరు నటీనటులు కలిసి నటించకపోయినా.. ఫ్రెండ్స్ అవుతారు. అలా కాకుండా ఒకట్రెండు సినిమాల్లో కలిసి నటించినా వాళ్ల ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్‌లో ఒకరే నవదీప్, అల్లు అర్జున్. ఈ ఇద్దరు కలిసి చేసింది రెండు సినిమాలే అయినా కూడా వీరి బాండ్ చాలా స్పెషల్. అయితే తాజాగా నవదీప్‌కు ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ను పంపించాడు బన్నీ. దీనిని నవదీప్ సంతోషంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు.
నవదీప్, అల్లు అర్జున్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా పెద్దగా బయట కలిసి కనిపించరు. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉంటారు. 'ఆర్య 2'తో మొదలయిన వీరి స్నేహం.. 'అల వైకుంఠపురంలో' వరకు సాగింది. తాజాగా బన్నీ బర్త్ డే బ్యాష్‌లో కూడా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు. అయితే సందర్భం లేకుండానే ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌తో నవదీప్‌ను సర్‌ప్రైజ్ చేశాడు బన్నీ.
'హద్దుల్లేని ప్రేమ ఉన్నప్పుడు సందర్భం లేకుండా గిఫ్ట్‌లు కూడా వస్తాయి. థ్యాంక్స్ అల్లు అర్జున్ బావ్స్. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఎయిర్‌పాడ్స్ వాడుతా' అని బన్నీ ఇచ్చిన ఎయిర్‌పాడ్స్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు నవదీప్.