Allu Arjun Pushpa : అల్లు అర్జున్ 'పుష్ప' సప్‌రైజ్ వచ్చేసింది..!
Allu Arjun Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే... ఈ సినిమా నుంచి సప్‌రైజ్ వచ్చేసింది.;
Allu Arjun Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే... ఈ సినిమా నుంచి సప్‌రైజ్ వచ్చేసింది. పుష్పరాజ్ ప్రీల్యూడ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 18 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఏప్రిల్ 7న మరో సప్‌రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం ఆ రోజున సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.