Allu Arjun : నేను పనికి రానని అప్పుడే డిసైడ్ అయ్యారు : అల్లు అర్జున్
Allu Arjun : అల్లు అర్జున్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి;
Allu Arjun : అల్లు అర్జున్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీనియర్ హాస్యనటుడు అల్లురామలింగయ్య శత జయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా పుస్తకాన్ని ఆవిశ్వరించారు. బన్నీ, మెగాస్టార్, వెంకయ్య నాయుడు కూడా ఈ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. తాతయ్యతో తనకున్న గ్నాపకాలను పంచుకున్నారు స్టైలిష్ స్టార్.
'నేను నాల్గవ తరగతిలో చదువుతున్నప్పటి నుండి నాకోసం డబ్బు జమ చేశారు తాతయ్య. నాకు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.10 లక్షలు జమయ్యాయి. వాటిని నాకిచ్చారు. నేనెందుకూ పనికిరానని చిన్నప్పుడు ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు నా విజయాలు చూస్తే ఆయన చాలా సంతోషించేవారు' అని తన మనసులోని భావాలను పంచుకున్నారు అల్లు అర్జున్.