విడాకులపై నోరువిప్పిన అమలాపాల్..!
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తో వివాహం, విడాకుల పట్ల నటి అమలపాల్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది.;
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తో వివాహం, విడాకుల పట్ల నటి అమలపాల్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. వివాహ బంధంలో ఉన్నప్పుడు తనను చెడ్డ మహిళగా చూపించడంతో మానసికంగా చాలా ఒత్తిడికి లోనయ్యానని వెల్లడించింది. ఆలాంటి క్లిష్ట పరిస్థితిల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారెవరూ తనకి అండగా నివలేదని, తానే ఒంటిరిగానే పోరాటం చేశానని చెప్పింది. అంతేకాకుండా విజయ్ తో విడిపోవాలని అనుకొన్నప్పుడు అందరూ నన్ను భయపెట్టారని, నువ్వు ఒక అమ్మయివంటూ ఎగతాళి చేశారని చెప్పుకొచ్చింది. కాగా 2014 ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్... మనస్పర్థలతో 2017లో విడాకులు తీసుకున్నారు.