Ananya Panday: మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'లైగర్' బ్యూటీ..
Ananya Panday: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనన్య పాండే.;
Ananya Panday: ప్రస్తుతం సౌత్‌లో ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. అందుకే బాలీవుడ్ భామలు కూడా తెలుగు చిత్రాల్లో నటించడానికి వెనకాడడం లేదు. పైగా బాలీవుడ్ హీరోయిన్లను తీసుకుంటే.. ఆ సినిమాకు హిందీలో కూడా క్రేజ్ వస్తుందని మేకర్స్ అనుకుంటున్నారు. అందుకే పూరీ జగన్నాధ్.. విజయ్ దేవరకొండతో చేస్తున్న 'లైగర్' కోసం అనన్య పాండేను సెలక్ట్ చేశాడు. ఇక ఈ మూవీ విడుదల అవ్వకముందే అనన్యకు మరో స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వచ్చినట్టు టాక్.
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనన్య పాండే. ఆ తర్వాత కూడా ఒకట్రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసింది. కానీ దాని వల్ల తాను కోరుకున్నంత స్టార్‌డమ్ అయితే రాలేదు. కానీ టాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. విజయ్ దేవరకండ లాంటి యంగ్ హీరోతో లైగర్‌లో నటిస్తోంది. ఇంతలోనే మరో స్టార్ హీరో సినిమాలో అనన్య హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌టీఆర్‌తో తాను చేస్తున్న సినిమాలో బాలీవుడ్ భామనే హీరోయిన్‌గా సెలక్ట్ చేయాలి అనుకుంటున్నాడు కొరటాల శివ. ముందుగా ఇందులో ఆలియా భట్ కన్ఫర్మ్ అనుకున్నా కూడా పలు కారణాల వల్ల తాను ఈ సినిమా నుండి తప్పుకుంది. అయితే తాజాగా అనన్య పాండేను ఈ సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మూవీ టీమ్ ఓ క్లారిటీ ఇవ్వాల్సిందే.