Anasuya Bharadwaj: 'జబర్దస్త్'లో అనసూయ లాస్ట్ ఎపిసోడ్.. సెట్‌లో అందరూ కంటతడి..
Anasuya Bharadwaj: అనసూయ సహాయ నటిగా తన కెరీర్‌ను చాలా ఏళ్ల క్రితమే ప్రారంభించింది.;
Anasuya Bharadwaj: 'జబర్దస్త్' అనే స్టాండప్ కామెడీ షో తెలుగులో స్టాండప్ కామెడీలకు కొత్త ఊపునిచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమయిన ఈ షో ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కొత్త తరహా కామెడీ స్కిట్లతో ఎంతోమంది కొత్త కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ నుండి ఒక్కొక్కరిగా చాలామంది తప్పుకుంటున్నారు. ఇప్పుడు అది అనసూయ వంతు.
అనసూయ సహాయ నటిగా తన కెరీర్‌ను చాలా ఏళ్ల క్రితమే ప్రారంభించింది. కానీ జబర్దస్త్ అనే కామెడీ షో.. తనకు యాంకర్‌గా కొత్త లైఫ్ ఇచ్చింది. యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది అనసూయ. ఇప్పటికే సుకుమార్ లాంటి స్టార్ దర్శకుల సినిమాల్లో నటించింది. ఓవైపు సినిమాలు, మరోవైపు వేరే ఛానెళ్లలో షోలతో అనసూయ ఫుల్ బిజీ అవ్వడంతో జబర్దస్త్ నుండి తప్పుకోనుంది.
ఇప్పటికే అనసూయ.. తాను జబర్దస్త్ నుండి వెళ్లిపోతున్నట్టు ఓపెన్‌గా ప్రకటించింది. అయితే వచ్చే గురువారం టెలికాస్ట్ అయ్యేది అనసూయకు చివరి ఎపిసోడ్‌లాగా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్ అవ్వగా.. అందులో అనసూయ వెళ్లిపోతున్నందుకు అందరూ ఎమోషనల్ అయ్యారు.
జడ్జి ఇంద్రజ సైతం స్టేజ్‌పైకి వచ్చి అనసూయను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. 'నెలలో మూడు రోజులు జబర్దస్త్ కోసం అడ్జస్ట్ చేయలేవా' అని చంటి అడిగిన ప్రశ్నకు అనసూయ మౌనం వహించింది. మరి వారికి అనసూయ ఏమైనా సమాధానం ఇచ్చిందా, లేదా తెలియాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యేవరకు వేచిచూడాల్సిందే.