Anchor pradeep : యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం.. !
ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పాండురంగ (65) కరోనాతో మృతి చెందారు.;
ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పాండురంగ (65) కరోనాతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న(శనివారం) రాత్రి మృతి చెందారు. మరోవైపు ప్రదీప్ కూడా కరోనాతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రదీప్ స్పందించలేదు. దీనిపైన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.