Anchor Sreemukhi Car : 'తమ్ముడికి ప్రేమతో' .. ఖరీదైన కారు కొన్న రాములమ్మ...!
Anchor Sreemukhi Car : యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. పటాస్ షోతో ఫుల్ పాపులర్ అయిన శ్రీముఖికి బుల్లితెర ‘రాములమ్మ’గా కూడా మంచి పేరుంది.;
Anchor Sreemukhi Car : యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. పటాస్ షోతో ఫుల్ పాపులర్ అయిన శ్రీముఖికి బుల్లితెర 'రాములమ్మ'గా కూడా మంచి పేరుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఫోటో షూట్ లతో పాటుగా తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన తమ్ముడు సుష్రుత్ కి ఖరీదైన కారుని కొని గిఫ్ట్ గా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో అభిమానులు ఆమెకి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా తాజాగా క్రేజీ అంకుల్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీముఖి.