Anchor suma : ఆ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సుమ..!

Anchor suma : యాంకర్ సుమ.. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. గత రెండు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో తనకి తానే సాటి, ఎవరు లేరు పోటీ అన్నట్టుగా దూసుకుపోతుంది.

Update: 2021-10-09 09:37 GMT

యాంకర్ సుమ.. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. గత రెండు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో తనకి తానే సాటి, ఎవరు లేరు పోటీ అన్నట్టుగా దూసుకుపోతుంది. ఇదిలావుండగా తాజాగా తన సొంత యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన సుమ.. అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇంతకీ సుమ ఏం అందంటే.. కొన్నేళ్ళుగా ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను.. కానీ ఇప్పుడు చెప్పేస్తున్నాను.. నేను కీలాయిడ్‌ టెండెన్సీ అనే స్కిన్‌ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నాను.. ఇది ఎలా అంటే ఓ చిన్న గాయం అయితే అది చుట్టుపక్కల కూడా వ్యాపిస్తుంది. ఇది పోగొట్టుకోవడానికి అన్నీ రకాల ప్రయత్నాలు చేశాను.. కానీ ఫలితం మాత్రం లేదు. ఇప్పుడిది నా శరీరంలో ఓ భాగమైంది. యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మేకప్‌ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలో తెలియక జరగాల్సిన ఈ డ్యామెజ్‌ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటున్నాను." అని చెప్పుకొచ్చింది. 

Tags:    

Similar News