Bigg Boss Anee Master : విన్నర్ కావడానికే షోకి వచ్చా : యానీ మాస్టర్
Bigg Boss Anee Master : బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు.;
Bigg Boss Anee Master : బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు. 'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై' అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మిస్టర్ మజ్ను పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అనంతరం పంచ అక్షరాల సాక్షి, పంచేద్రియాల సాక్షిగా, పంచ భూతాల సాక్షి నా పంచ ప్రాణాలు మీరే అంటూ అభిమానులను పలకరించాడు. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ని హౌస్ లోకి ఆహ్వానించాడు. అందులో భాగంగా ఐదో కంటెస్టెంట్‌గా యానీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్స్ లలో అబ్బాయిలే విన్ అయ్యారు. ఈ సారి అమ్మాయిలు కావాలని అందుకే తానూ షోలోకి వచ్చినట్టుగా చెప్పింది యానీ మాస్టర్. ఇక యానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలలో డాన్స్ మాస్టర్ గా యానీ మాస్టర్ కొనసాగుతున్నారు. సినిమాల్లో డాన్స్ మాస్టర్ గా సూపర్ అనిపించుకున్న యానీ మాస్టర్ మరి అనుకున్నట్టుగా విజేతగా నిలుస్తారో లేదో చూడాలి.