Ante Sundaraniki Trailer: 'అంటే.. సుందరానికీ' ట్రైలర్ వచ్చేసింది.. క్లీన్ కామెడీతో..
Ante Sundaraniki Trailer: అంటే.. సుందరానికీ ట్రైలర్‌లో మరోసారి క్లీన్ కామెడీతో నవ్వించారు నాని, నజ్రియా.;
Ante Sundaraniki Trailer: టాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో స్పీడ్‌గా సినిమాలు చేసేవారిలో నాని కూడా ఒకరు. మినిమమ్ గ్యారెంటీ హిట్స్‌తో, ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరయిపోయాడు నాని. నాని సినిమా వస్తుందంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేయొచ్చు అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే విషయన్ని ప్రూవ్ చేయడానికి 'అంటే.. సుందరానికీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలయ్యింది.
నాని, నజ్రియా, వివేక్ ఆత్రేయా.. అంతా యంగ్ టాలెంట్ కలిసి ఓ సినిమా తీస్తున్నారంటేనే.. ఆ మూవీ మీద యూత్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక టైటిల్ దగ్గర నుండి విడుదలయిన పాటల వరకు ఈ సినిమా కోసం అందరూ ఎదురుచూసేలా చేశాయి. తాజాగా ట్రైలర్‌తో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది అంటే.. సుందరానికీ. ట్రైలర్ ప్రారంభం నుండి ఎక్కడా సీరియస్ మోడ్‌లో లేకుండా చివరి వరకు క్లీన్ కామెడీతోనే సాగిపోతుంది.
అంటే.. సుందరానికీ ట్రైలర్‌లో మరోసారి క్లీన్ కామెడీతో నవ్వించారు నాని, నజ్రియా. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ కూడా కామెడీతో నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఎప్పటిలాగానే దర్శకుడు వివేక్ ఆత్రేయా కామెడీ మూవీకి ఓ ఫ్రెష్ టచ్ ఇచ్చినట్టుగా ట్రైలర్‌లో కనిపిస్తోంది. ఇక జూన్ 10న అంటే.. సుందరానికీ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.
This June 10th!
— Nani (@NameisNani) June 2, 2022
It will be a celebration in theatres ♥️😆 🪄
Here's the THEATRICAL TRAILER of #AnteSundaraniki 👇🏼https://t.co/1xiKIcx7e9 pic.twitter.com/pYVtxcLyPP