Anupama Parameswaran: అనుపమ ఫ్యాన్స్‌కు షాక్.. ఆ సినిమా నేరుగా ఓటీటీకే..
Anupama Parameswaran: ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో నిఖిల్‌తో నటిస్తున్నవే రెండు సినిమాలు ఉన్నాయి;
Anupama Parameswaran: మలయాళ ముద్దుగుమ్మలకు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ముందుగా సెకండ్ హీరోయిన్‌గా పరిచయమయినా.. మొదటి సినిమా నుండే తన అందంతో మ్యాజిక్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుపమ.. తన ఫ్యాన్స్‌కు పెద్ద షాకే ఇవ్వనుందని సమాచారం.
అనుపమ పరమేశ్వరన్ చివరిగా 'రౌడీ బాయ్స్' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీలో లిప్ లాక్ సీన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తాజాగా నాని నటించిన 'అంటే సుందరానికీ' సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఇందులో తను గెస్ట్ రోల్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించని తనపై విమర్శలు వచ్చాయి. అయినా అవేవి పట్టించుకోకుండా అనుపమ ముందుకెళ్తోంది.
ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో నిఖిల్‌తో నటిస్తున్నవే రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా 'బటర్‌ఫ్లై' అనే ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది అనుపమ. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదలయ్యి మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.
అనుపమ నటించిన మొదటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయిన 'బటర్‌ఫ్లై' నేరుగా హాట్‌స్టార్‌లో విడుదల కానుందని ప్రచారం మొదలయ్యింది. సతీష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి హాట్‌స్టార్ కాదనలేని ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.