Anushka Shetty: బడా బిజినెస్‌మ్యాన్‌తో అనుష్క పెళ్లి ఫిక్స్..?

Anushka Shetty: అందం, అభినయం సమపాళ్లలో ఉన్నట్టుగా అనిపించే అనుష్క.. సినిమాలకు దూరమయ్యి చాలాకాలమే అయ్యింది.

Update: 2022-07-24 16:15 GMT

Anushka Shetty: పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టిన తర్వాత నటీనటులు పర్సనల్ విషయాలపై కూడా ఆసక్తి చూపిస్తారు ప్రేక్షకులు. ముఖ్యంగా నటీనటుల డేటింగ్ గురించి, పెళ్లి గురించి అనేక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అందులోనూ సింగిల్‌గా ఉన్న హీరోయిన్స్‌పై ఇలాంటి పెళ్లి రూమర్స్ కాస్త ఎక్కువే వస్తూ ఉంటాయి. తాజాగా స్వీటీ శెట్టి.. అనుష్కపై కూడా ఇలాంటి రూమర్సే వైరల్ అవుతున్నాయి.

అందం, అభినయం సమపాళ్లలో ఉన్నట్టుగా అనిపించే అనుష్క.. సినిమాలకు దూరమయ్యి చాలాకాలమే అయ్యింది. యూవీ క్రియేషన్స్‌తో అనుష్క ఓ సినిమా చేస్తుందని తన పుట్టినరోజు నాడు ఈ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా నవీన్ పోలిశెట్టితో కూడా ఓ మూవీకి కమిట్ అయ్యింది స్వీటీ. కానీ అవేవి సెట్స్‌పైకి వెళ్లడం లేదు. దీంతో అనుష్క పెళ్లి గురించి ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి.

అనుష్క.. ఓవైపు సినిమాలకు, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. అంటే దీని వెనుక తన పెళ్లే కారణమని అభిమానులు అనుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన ఓ బడా వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి జరగనుందని, అందుకే తను కూడా సినిమాలకు దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ అనుష్క పెళ్లిపై ఇలా ఎన్నో రూమర్స్ వచ్చాయి. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ నిజమవుతాయో లేదో చూడాలి.

Tags:    

Similar News