సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు..!
హైదరాబాద్ అపోలో అస్పత్రిలో హీరో సాయి ధరమ్ తేజ్‌కు వైద్యం కొనసాగుతోంది. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో చికిత్స జరుగుతోంది.;
హైదరాబాద్ అపోలో అస్పత్రిలో హీరో సాయి ధరమ్ తేజ్‌కు వైద్యం కొనసాగుతోంది. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో చికిత్స జరుగుతోంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్‌ను అపోలో వైద్యులు విడుదల చేశారు. ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని... ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ఇంటర్నల్‌గా ఎటువంటి గాయాలు లేదన్నారు అపోలో వైద్యులు. మరో 24 గంటల తర్వాత కాలర్ బోన్ శస్త్ర చికిత్స గురించి చూస్తామన్నారు డాక్టర్లు. అటు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ సెలబ్రిటీలు కోరుకుంటున్నారు.