Aryan Khan : ఖైదీ నెం. 956 ఆర్యన్ ఖాన్..!
Aryan Khan : సినీ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి పోలీసులు ఖైది నెంబర్ 956 గా కేటాయించారు. అలాగే అతనికి ఇంటి నుంచి రూ. 4,500మనీ ఆర్డర్ వచ్చింది.;
Aryan Khan : సినీ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి పోలీసులు ఖైది నెంబర్ 956 గా కేటాయించారు. అలాగే అతనికి ఇంటి నుంచి రూ. 4,500మనీ ఆర్డర్ వచ్చింది. వీటిని క్యాంటిన్ ఖర్చులుగా ఆర్యన్ వాడుకోనున్నాడు. జైలు రూల్స్ ప్రకారం.. అరెస్టయి జైల్లో ఉన్నవారికి రూ.4500 మాత్రమే గరిష్ఠంగా ఇచ్చేందుకు అనుమతిస్తారు. ఖైదీలు వారానికి ఒకసారి వారి కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది.
ఆ ప్రకారం ఆర్యన్ శుక్రవారం తన తండ్రి షారుక్, అమ్మ గౌరీఖాన్‌తో కాసేపు వీడియోకాల్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఇక తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆర్యన్ ని కామన్ సెల్‌కి పంపించామన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ ఫిటిషన్ ఈ నెల 20కి వాయిదా పడింది. అప్పటివరకు అతను ముంబైలోని జైల్లోనే ఉండనున్నాడు.