Babu Mohan: అప్పుడే నాపై హత్యా ప్రయత్నం జరిగింది: బాబు మోహన్
Babu Mohan: బాబు మోహన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కచ్చితంగా పాన్ తింటారని తెలిసిన కొందరు అందులో విషం కలిపి ఇచ్చారట.;
Babu Mohan: ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు బాబు మోహన్. సినిమాల్లో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ఆయనేంటో నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న బాబు మోహన్.. అప్పుడప్పుడు ఈవెంట్స్‌లో, రియాలిటీ షోలలో పాల్గొంటూ కనిపిస్తు్న్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. తనపై జరిగిన హత్య ప్రయత్నం గురించి బయటపెట్టారు.
తాను, తనికెళ్ల భరణి కలిసి ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో తనను పాన్ తినమని తనికెళ్ల భరణి చెప్పారని అన్నారు బాబు మోహన్. ఆ తర్వాత తనకు పాన్ తినడం బాగా నచ్చడంతో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్‌లు తినేవారని తెలిపారు. అలాంటి సమయంలో తనకు సంగారెడ్డిలోని ఓ పాన్ డబ్బాలో పాన్ బాగా నచ్చిందని, అక్కడికి వెళ్లిన ప్రతీసారి అక్కడ పాన్ తినేవారని చెప్పారు.
అయితే బాబు మోహన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కచ్చితంగా అక్కడ పాన్ తింటారని తెలిసిన కొందరు అందులో విషం కలిపి తనకు ఇచ్చారట. ఆయన అక్కడ పాన్ తీసుకొని తిందామనే సమయానికి ఎవరో ఫోన్ చేసి అందులో విషయం కలిపారని చెప్పారట. ఆ తర్వాత పాన్ డబ్బా ఆవిడకి ఫోన్ చేస్తే తమను బెదిరించి పాన్‌లో విషం కలిపించారన్న విషయాన్ని చెప్పిందట. అప్పుడే తనకు రాజకీయాలు ఎంత ప్రమాదమని అర్థమయిందని తెలిపారు బాబు మోహన్.