Balakrishna: మరో ఓటీటీ షోలో బాలయ్య.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
Balakrishna: అన్‌స్టాపబుల్ ఇచ్చిన ఊపుతో ఆహాలో మరిన్ని కొత్త షోలు ప్రారంభమయ్యాయి.;
Balakrishna: సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాల్లో హీరోగానే అందరికీ తెలుసు. ఆయన డైలాగు చెప్పినా.. తొడకొట్టినా.. థియేటర్లలో ప్రేక్షకులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అలాంటి బాలయ్య బుల్లితెరపై కనిపిస్తాడని కూడా ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి హోస్ట్‌గా మారి బాలయ్య ఎంటర్టైన్ చేసిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి బాలయ్య బుల్లితెరపై కనిపించడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఆహా ఓటీటీలో ఎన్ని షోలు వచ్చినా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సాధించినంత సక్సెస్ మరే షో సాధించలేకపోయింది. తనకు నచ్చని పని చేస్తే వెంటనే కోప్పడే బాలయ్య.. హోస్ట్‌గా ఎలా ఉంటారో చూద్దామని.. ఈ షోను రెగ్యులర్‌గా ఫాలో అయినవారు కూడా ఉన్నారు. ఆ క్రేజ్‌తోనే అన్‌స్టాపబుల్ షో.. ఐఎమ్‌డీబీలో స్థానం దక్కించుకుంది.
అన్‌స్టాపబుల్ ఇచ్చిన ఊపుతో ఆహాలో మరిన్ని కొత్త షోలు ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి తెలుగు ఇండియన్ ఐడల్. ఓటీటీలోని పాటల షోలలో బాగా పాపులారిటీ సాధించుకుంది ఈ తెలుగు ఇండియన్ ఐడల్. అయితే ఈ షోలో విజేతగా నిలిచే సింగర్‌కు బాలయ్య చేతులో మీదుగా బహుమతి అందనుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్‌లో బాలయ్య గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆహా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.