Balakrishna Birthday: బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు.. 62 కిలోల కేకు కట్..
Balakrishna Birthday: క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో మంది పేద క్యాన్సర్ రోగులకు వెలుగునిస్తోందని నందమూరి బాలకృష్ణ అన్నారు.;
Balakrishna Birthday: క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో మంది పేద క్యాన్సర్ రోగులకు వెలుగునిస్తోందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు . అనంతరం అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన సరికొత్త ఆరోగ్య శ్రీ ఓ పి డి బ్లాక్ ను బాలకృష్ణ ప్రారంభించారు.
క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులతో కలిసి 62 కిలోల కేకును కట్ చేసి చిన్నారులకు తినిపించారు. నటుడిగా.. ప్రతినిధిగా ఎన్నో రకాల పాత్రలను న్యాయబద్దంగా పోషించడానికి అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తే.. వైద్య సేవలను మరింత విస్తరిస్తామన్నారు.