Balakrishna: అభిమానితో కలిసి బాలయ్య భోజనం..
Balakrishna: అభిమానుల మీద తనకున్న ప్రేమను నందమూరి బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు.;
Balakrishna: అభిమానుల మీద తనకున్న ప్రేమను నందమూరి బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు. తాజాగా బాలకృష్ణ చేసిన పనికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 107వ సినిమా షూటింగ్‌లో భాగంగా కర్నూలులో ఉన్న ఆయన.. ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్‌కు ఫోన్ చేసి కర్నూలుకి పిలిపించుకున్నారు.
తాను ఉన్న హోటల్‌కు కుటుంబంతో సహా రావాల్సిందిగా సజ్జాద్‌ను ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి.. వారి బాబుతో ఆడుకుంటూ సందడి చేశారు. ఒక సామాన్య అభిమానితో.. బాలయ్య బాబు కలిసి భోజనం చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అంటూ సజ్జాద్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.