Bandla Ganesh : ప్రకాష్ రాజ్ ట్వీట్.. 'ఒకే ఓటు బండ్లకి వేయండి'.. గణేష్ రీట్వీట్..!
Bandla Ganesh : 'మా' ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు ఏకంగా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.;
Bandla Ganesh : 'మా' ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు ఏకంగా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్‌ల పర్వం ముగిసింది. మంచు విష్ణు ప్యానల్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు తమ తమ నామినేషన్‌లు దాఖలు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీగా అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.
తన ప్యానల్ సభ్యులతో ఉన్న పాంప్లేట్ ఫొటో షేర్ చేస్తూ..మీ ఓటే మీ గొంతు.. 'మా' హితమే మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం..'మా' ఆశయాలను గెలిపిద్దామంటూ చేతులు జోడించిన చేతుల ఏమోజీలను జత చేశాడు ప్రకాష్‌రాజ్.. అయితే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ని బండ్ల గణేష్ రీట్వీట్ చేస్తూ.. " ఒకే ఒక ఓటు మాత్రం జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కి ఓటు వేయండి" అని పోస్ట్ చేసుకోచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి.