Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం.. వీటి వెనుక అర్థమేంటి..?
Bandla Ganesh: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యి పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి.;
Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌కు ప్రేక్షకుల్లోనే కాదు.. సెలబ్రిటీల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనతో సినిమా తీయాలని, ఆయన ఫ్యాన్స్‌గా ఇప్పటికీ ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక అలాంటి అభిమానుల్లో ఒకరు బండ్ల గణేష్. ఛాన్స్ దొరికినప్పుడల్లా పవన్‌పై తన ప్రేమను చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు బండ్ల గణేష్. అలాగే తాజాగా మరోసారి పవర్ స్టార్‌పై ట్వీట్ వర్షం కురిపించారు ఈ నిర్మాత.
'నా దైవ సమానులైన పవన్ కళ్యాణ్.. మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్' అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఆ తర్వాత మరికాసేపటికే 'మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే' అంటూ మరో ట్వీట్ చేశారు.
నా దైవ సమానులైన మా @PawanKalyan మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్ 🙏 pic.twitter.com/OtHMCRIHl1
— BANDLA GANESH. (@ganeshbandla) August 6, 2022
మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే @PawanKalyan 🔥🔥🔥🔥 pic.twitter.com/G4YcSUHTQE
— BANDLA GANESH. (@ganeshbandla) August 6, 2022
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యి పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సిన సమయం కూడా దగ్గర్లోనే ఉంది. ఇక ఇంతలోనే బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు కొత్త డౌట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఒకవేళ పవన్ ఏమైనా బండ్లతో సినిమా కమిట్ అయ్యారా? దానికోసమే ఈ నిర్మాత ఎదురుచూస్తున్నారా? అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇక ఈ ట్వీట్లకు అర్థమేంటో బండ్ల గణేషే తెలియజేయాలి.