Akhil Agent Movie : ఏజెంట్‌లో ఆ సీన్ కోసం భారీ సెట్..
Akhil Agent Movie : సురేందర్ రెడ్డి దర్శకత్వం అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ఇప్పటికే ఎన్నో అంచనాలను పెంచేసింది;
Akhil Agent Movie : సురేందర్ రెడ్డి దర్శకత్వం అఖిల్ 'ఏజెంట్' సినిమా ఇప్పటికే ఎన్నో అంచనాలను పెంచేసింది. టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండడంతో సినిమా పై ప్రేక్షకులు అంచనాలు భారీగా ఉన్నట్లు టాక్ వినిసిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ ఇంట్రొడక్షన్‌ను ప్రత్యేకంగా చూపించడం కోసం భారీ సెట్ వేస్తున్నట్లు సినీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ తన కెరీర్‌లో మొదటి సారి ప్యాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. దీంతో ఆయన పరోక్షంగా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరకాబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. స్పై థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీని తెరకెక్కించారు మేకర్స్. సినిమా రిలీజ్ డేట్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు.