బిగ్‌బాస్ జెన్యూన్ గేమ్ షో.. అవకాశం వస్తే మళ్ళీ వెళ్తా : ఉమాదేవి
తెలుగు రాష్ట్రాల్లో కార్తికదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్‌లో అర్థపావు భాగ్యంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.;
తెలుగు రాష్ట్రాల్లో కార్తికదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్‌లో అర్థపావు భాగ్యంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది నటి ఉమాదేవి. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన ఈమె.. రెండో వారంలో ఎలిమినేట్ అయి ఇంటిదారి పట్టింది. నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడటం, చిన్న విషయానికే గొడవకు దిగడం ఆమెకు పెద్ద మైనస్‌గా మారాయి. ఇదిలావుండగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ఉమాదేవి బిగ్‌బాస్ షో గురించి, హౌస్‌మేట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అందరూ అనుకుంటున్నట్లుగా బిగ్‌బాస్ షోలో అసలు స్క్రిప్టు అనేది ఉండదని, చాలా జెన్యూన్ గేమ్ షో అంది. మళ్ళీ అవకాశం వస్తే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఇంకా బాగా ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక తాను ముక్కుసూటిగా మాట్లాడతానని, అయితే హౌస్‌మేట్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. హౌస్ నుంచి బాధగా ఉందని అభిప్రాయపడింది.