పవన్ కళ్యాణ్ నాకు దేవుడితో సమానం.. దయచేసి పిచ్చి.. పిచ్చి రాతలు రాయొద్దు : అషూరెడ్డి
పవన్ కళ్యాణ్ నాకు దేవుడితో సమానం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. దాన్ని వేరేలా ఆపాదిస్తూ కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారు. ఇది మంచిది కాదు.;
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, సినీ నటి అషూరెడ్డి స్పందించింది. 'పవన్ కళ్యాణ్ నాకు దేవుడితో సమానం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. దాన్ని వేరేలా ఆపాదిస్తూ కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారు. ఇది మంచిది కాదు. దీనివల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి.
ఇలాంటి వాటితో అభిమానులను కలవాలంటేనే ఆలోచించే స్థితికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్తున్నారు. దయచేసి పిచ్చిపిచ్చి రాతలు రాయకండి. . ఒక మనిషికి అభిమాని అంటే చచ్చేంతవరకు అభిమానిలాగే ఉంటారు. అంతే తప్ప అక్కడ ఇంకేమీ అవదు. కానీ మీ రాతల వల్ల ఉన్న పేరు నాశనం చేయొద్దు' అని ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. కాగా అషూ రెడ్డి పవన్ కల్యాణ్‌ను కలిసిన ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే..!