Bigg Boss 5 Telugu: వారానికి సరయూ పారితోషికం ఎంతో తెలుసా?
19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ సీజన్ ఫైవ్ అప్పుడే వారం అయిపోయింది. మొదటి వీక్ లో 7 ఆర్ట్స్ సరయూ ఎలిమినేట్ అయింది. కొండంత;
Bigg Boss 5 Telugu: 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ సీజన్ ఫైవ్ అప్పుడే వారం అయిపోయింది. మొదటి వీక్ లో 7 ఆర్ట్స్ సరయూ ఎలిమినేట్ అయింది. కొండంత ఆశతో హౌజ్ లోకి అడుగుపెట్టిన ఆమె టైం బాగోలేక వారానికే తట్టాబుట్టా సర్దేసింది. ఇదిలాఉంటే సోషల్ మీడియాలో సరయూ పారితోషికం గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న వారం రోజులకి గాను ఆమెకు 70 వేల నుంచి లక్ష రూపాయల మేరకు ముట్టజెప్పాడని సమాచారం. ఇదిలావుండగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల మీద సరయూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ బజ్ ప్రోగ్రామ్‌లో యాంకర్ అరియానా ముందే కంటెస్టెంట్ల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. చాలామంది ఇంకా ముసుగులు వేసుకునే ఆడుతున్నారని చెప్పింది. ప్రస్తతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండింగ్ మారింది.