Bigg boss season 5 Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో మిస్టర్ కూల్
Bigg boss season 5 Telugu : బిగ్‌బాస్ అంటే తెలుగు రియాలిటీ షోస్‌లో బాస్... ఈ సీజన్ 5 లో మిస్టర్ కూల్‌గా కనపడుతున్నాడు మానస్ ..;
బిగ్‌బాస్ అంటే తెలుగు రియాలిటీ షోస్‌లో బాస్... ఈ సీజన్ 5 లో మిస్టర్ కూల్‌గా కనపడుతున్నాడు మానస్ .. పెద్దగా హైప్ లేకుండా ఎంటర్ అయిన మానస్ బెహేవియర్ ఇప్పుడు అందరి మన్ననలు పొందుతుంది. తన మాట తీరు.. మెలిగే తీరు హౌస్ లోనూ, బయట అందరినీ ఆకట్టుకుంటుంది. ఎదో చేసి బాగా కనపడాలి అనే తాపత్రయం లేకుండా తన గేమ్‌ని చాలా స్ట్రాటజీతో అడుతున్నాడు. హౌస్‌మెట్ లతో పోటీ ఉంటుంది.. కానీ మానస్ అంటే మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ ఉంది. యాంకర్ రవి, లోబో, ప్రియ , సిరి, అర్ జె కాజల్‌లు కాస్త హైపర్‌గా స్క్రీన్ టైం ఎక్కువ తీసుకున్నా.. స్లో గా మానస్ గేమ్‌లో స్ట్రాంగ్ అవుతున్నాడు. , శ్రీరామ్‌చంద్ర,విశ్వ లకు మానస్ గట్టి పోటీగా తయారయ్యే అవకాశం ఉంది. నాగార్జున కూడా మానస్ తీరుకు ఫిదా అయ్యాడు..మానస్ వంటి ఈ జనరేషన్ కుర్రాడు చూపిస్తున్న మెచ్యూరిటీ మరింతగా ఆకట్టుకుంటుంది..తన కూల్ అట్టిట్యూడ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతున్న మానస్ ఈ వారం ఎలిమినేషన్స్ లో లేడు.. ఇక తన గేమ్ ఈ వారంలో తెలుస్తుంది..