Bigg Boss Tamil 5 : తమిళ్ బిగ్‌బాస్ లోకి తెలుగు బ్యూటీ.. ఎవరీ పావని రెడ్డి?
Bigg Boss Tamil 5 : కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 5 అక్టోబర్ 3న (ఆదివారం) రోజున గ్రాండ్‌గా మొదలైంది.;
Bigg Boss Tamil 5 : కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 5 అక్టోబర్ 3న (ఆదివారం) రోజున గ్రాండ్‌గా మొదలైంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ఓ తెలుగు అమ్మాయి కూడా ఉంది. ఆమె పావని రెడ్డి.. ఇప్పుడు ఎవరీ అమ్మాయని నెటిజన్లు సెర్చింగ్ మొదలుపెట్టారు.
పావని రెడ్డి మొదట్లో మోడలింగ్ చేసింది.. ఆ తర్వాత రెట్టా వాల్ కురువి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇక తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్ లలో నటించి మంచి ఫేం సంపాదించుకుంది.
ఆ తర్వాత ఆమె.. ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి సినిమాల్లోనూ నటించింది కానీ అంతగా గుర్తింపు అయితే రాలేదు.. ఈ క్రమంలో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అయిపొయింది. చిన్నతంబి, రసంతి సీరియల్స్ ఆమెకి మంచి క్రేజ్‌ని తీసుకువచ్చాయి.
ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి 2013లో నటుడు ప్రదీప్ కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయిన మూడేళ్ల తర్వాత 2020లో ఆనంద్ జాయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అదే సంవత్సరంలో చెన్నైలో ఓ ఇల్లుని కొనుక్కుంది. ఇక అటు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.