Bigg Boss sirihanmanth : బిగ్‌బాస్ తొలి కంటెస్టెంట్ : ఎవరీ సిరి హన్మంత్?
Bigg Boss sirihanmanth : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు.;
Bigg Boss sirihanmanth : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు. 'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై' అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మిస్టర్ మజ్ను పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అనంతరం పంచ అక్షరాల సాక్షి, పంచేద్రియాల సాక్షిగా, పంచ భూతాల సాక్షి నా పంచ ప్రాణాలు మీరే అంటూ అభిమానులను పలకరించాడు. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ని హౌస్ లోకి ఆహ్వానించాడు. అందులో భాగంగా బిగ్ బాస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ క్రాక్ సినిమాలోని భూమ్ బద్దల్ సాంగ్‌కి ప్పులేస్తూ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చింది. ఇంతకీ ఎవరీ సిరి హన్మంత్ అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారు. సిరి హన్మంత్ ముందుగా విశాఖపట్నంలో ప్రాంతీయ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చేసింది. ఇక్కడ కూడా న్యూస్ రీడర్‌గానే పనిచేసింది. ఈ క్రమంలో ఆమెకి బుల్లితెర సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ లలో నటించి ఫేం సంపాదిచుకుంది. ఇప్పుడీ ఈ భామ బిగ్ బాస్ లో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.