పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ కొట్టేసిన దివి?
ఇలా వరుసగా బిగ్ ఆఫర్స్ తో దూసుకుపోతుంది దివి.. కేవలం దివి మాత్రమే కాదు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.;
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్ టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్సు అయిందో అప్పటినుంచే సినిమాపైన మంచి బజ్ ఏర్పడింది. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనమ్ కోషియం' రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో మంచి ఆఫర్ కొట్టేసిందట బిగ్‌బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ దివి వైద్య.. సినిమాలోని ఓ కీలకమైన పాత్రకు మేకర్స్ ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే పట్టాలేక్కనుంది. ఇక అటు మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే దివికి బిగ్ ఆఫర్ ఇచ్చేశారు, బిగ్‌బిస్ 4 ఫినాలే రోజున మెహర్ రమేష్ దర్శకత్వంలో తానూ చేయబోయే ఓ సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్టుగా చిరు ప్రకటించారు.
ఇలా వరుసగా బిగ్ ఆఫర్స్ తో దూసుకుపోతుంది దివి.. కేవలం దివి మాత్రమే కాదు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సోహైల్, అభిజీత్, మోనాల్, ఆరియనా లకి భారీ ఆఫర్స్ వచ్చాయి.