బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. ఏకంగా గోపీచంద్ సినిమాలో...
అతి సాధారణ వ్యక్తులుగా బిగ్ బాస్ హౌస్ నాల్గో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల క్రేజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయారు.;
అతి సాధారణ వ్యక్తులుగా బిగ్ బాస్ హౌస్ నాల్గో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల క్రేజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయారు. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి. సీజన్ లో మూడో స్థానంలో నిలిచినా సోహైల్‌కు ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్ కొట్టేశాడు. చిరంజీవి, కమెడియన్ బ్రహ్మానందం లాంటి వాళ్ళు గెస్ట్ రోల్స్ చేస్తామని ఆఫర్స్ కూడా ఇచ్చేశారు. అరియానా-అవినాష్ జోడీకి కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సీజన్ కి రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్ధక్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా, సంపత్ నంది డైరెక్షన్ లో కబడ్డీ ఆట నేపధ్యంలో సిటీమార్ అనే ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ కీలక పాత్ర కోసం అఖిల్ సార్ధక్ ను ఎంపిక చేసిందట చిత్ర బృందం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
బంపరాఫర్ కొట్టేసిన అఖిల్‌వాస్తవానికి అఖిల్ 2016లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. బావమరదలు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోకపోవడంతో బుల్లితెర వైపు అడుగులు వేశాడు. పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.