Bommarillu Bhaskar : బొమ్మరిల్లు భాస్కర్‌కు మరో బంపర్‌ ఆఫర్‌..!

Bommarillu Bhaskar : పరుగు సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంతో హిట్ కొట్టాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్..

Update: 2021-10-25 12:30 GMT

Bommarillu Bhaskar : పరుగు సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంతో హిట్ కొట్టాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.. అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌‌‌ని కూడా నిర్వహించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌‌ని ఎంజాయ్ చేస్తోన్న భాస్కర్‌‌కి బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. గీతాఆర్ట్స్ బ్యానర్‌లోనే మరో చిత్రం చేసేందుకు భాస్కర్ కమిట్ అయినట్టుగా సమాచారం. ఈ సినిమాని మెగా హీరోతోనే చేసేందుకు భాస్కర్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బొమ్మరిల్లు, పరుగు మొదలగు చిత్రాలతోమంచి గుర్తింపు తెచ్చుకున్న భాస్కర్‌ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' అనే సినిమాతో సక్సెస్‌‌ ట్రాక్‌‌లో పడ్డాడు. 

Tags:    

Similar News