Bullettu Bandi : సాయిశ్రీయ ఎఫెక్ట్... యూట్యూబ్‌లో బుల్లెట్టు బండి రికార్డు.. !
Bullettu Bandi : 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' ఇప్పుడు ఈ పాట లేకుండా పెళ్లిల్లు, ఈవెంట్స్ అయితే ఉండడం లేదు.;
Bullettu Bandi : 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' ఇప్పుడు ఈ పాట లేకుండా పెళ్లిల్లు, ఈవెంట్స్ అయితే ఉండడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరైనా సరే ఈ పల్లెటూరు పాటకి స్టెప్పులేస్తున్నారు. అయితే ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది. అయితే ఈ పాటకు ఇంత రీచింగ్ రావడానికి మాత్రం కారణం నవవధువు సాయిశ్రీయ అనే చెప్పాలి.
వాస్తవానికి ఈ పాటకి క్రేజ్ ఉంది. కానీ సాయిశ్రీయ ఈ పాటకి తన పెళ్లి బరాత్ లో డాన్స్ చేసి ఆదరగోట్టడం, ఆ వీడియో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఆమె ఓవర్ నైట్‌లో సెలబ్రిటీ అయిపొయింది. అదేవిధంగా ఈ వీడియోని చూసిన చాలా మంది ఈ పాట ఒరిజినల్ సాంగ్‌ని యూట్యూబ్‌కి వెళ్లి మరి చూశారు. దీనితో పాటకి రీచింగ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వంద మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది.
ఈ పాటకి రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించారు. బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ పాటని నిర్మించి.. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలచేసింది. వంద మిలియన్లు రావడం పట్ల సింగర్ గాయని మోహన భోగరాజు ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'నా తొలి పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అంటూ పోస్టు చేసింది.