Sai Pallavi: సాయిపల్లవిపై కేసు నమోదు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ..
Sai Pallavi: సినీనటి సాయిపల్లవిపై హైదరాబాద్‌లోని సుల్తానా బజార్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయింది.;
Sai Pallavi: సినీనటి సాయిపల్లవిపై హైదరాబాద్‌లోని సుల్తానా బజార్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయింది. గో రక్షకులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారంటూ సాయిపల్లవిపై కేసు పెట్టారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. విరాటపర్వం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి గో రక్షకులను అవమానించే విధంగా మాట్లాడారంటూ సుల్తానా బజార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు సాయిపల్లవిపై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నటి మాట్లాడారని వారు అన్నారు.