డ్రగ్స్ ముఠాతో సెలబ్రిటీల లింకులు
కేపీ చౌదరి అరెస్ట్‌తో సిని డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చింది. పలువురు సెలబ్రిటీల్లో గుబులు మొదలైంది.;
కేపీ చౌదరి అరెస్ట్‌తో సిని డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చింది. పలువురు సెలబ్రిటీల్లో గుబులు మొదలైంది.రోషన్ అనే ప్లెడ్లర్ విచారణలో కేపీ చౌదరి వ్యవహరం వెలుగుచూసింది.గోవా, హైదరాబాద్‌లో పార్టీలు నిర్వహించారు కేపీ చౌదరి, అయన నుంచి నాలుగు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పార్టీకి హాజరైన సెలబ్రిటీల లిస్టును తయారు చేస్తున్నారు.మొబైల్ డేటా ఆధారంగా డ్రగ్స్ ముఠాతో సెలబ్రిటీల లింకులను బయటికి తీయనున్నారు.
మరోవైపు పక్కా సమాచారంలోనే కేపీ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించి 82 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి.గతంలో కేపీ చౌదరి కబాలి సినిమా తెలుగు వర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించారని, మరికొన్ని తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారని తెలిపారు.సినిమాల్లో నష్టం రావడంతో గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొని సినీ పరిశ్రమలో ఉన్న పరిచయాలతోడ్రగ్స్ దందా చేశాడని తెలిపాడు.