Liger Movie: 'లైగర్' రిజల్ట్‌పై ఛార్మీ కామెంట్స్.. ఎన్నో అడ్డంకులు వచ్చాయంటూ..

Liger Movie: ఈరోజుల్లో కుటుంబం మొత్తం ఇంట్లో కూర్చొని భారీ బడ్జెట్ సినిమాలు చూడగలుగుతున్నారని ఛార్మి చెప్పుకొచ్చింది.

Update: 2022-08-30 06:54 GMT

Liger Movie: భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుని, ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'లైగర్'. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది. విడుదలయిన మొదటిరోజు ఫస్ట్ డే నుండే ప్రేక్షకులు దీనికి నెగిటివ్ టాక్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో తర్వాత సినిమా చూద్దామనుకున్నవారు వెనక్కి తగ్గారు. అయితే లైగర్ ఇలా అయిపోవడంపై నిర్మాత ఛార్మి స్పందించింది.

పూరీ జగన్నాధ్.. లైగర్‌ను డైరెక్ట్ చేయడం మాత్రమే కాదు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు కూడా. ఛార్మి, కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. లైగర్ ప్రమోషన్స్ సమయంలో ఛార్మి కూడా అందరితో సమానంగా కష్టపడింది. అయితే ఇటీవల పెరుగుతున్న ఓటీటీ కల్చర్‌తో పాటు లైగర్ పరాజయంపై ఛార్మి స్పందించింది. తన మనసులో మాటను బయటపెట్టింది.

ఈరోజుల్లో కుటుంబం మొత్తం ఇంట్లో కూర్చొని భారీ బడ్జెట్ సినిమాలు చూడగలుగుతున్నారని ఛార్మి చెప్పుకొచ్చింది. కాబట్టి సినిమాలు వారిని ఎగ్జైట్ చేసేంత వరకు వారు థియేటర్లకు రావడానికి ఇష్టపడడం లేదని తెలిపింది. ఇటీవల విడుదలయిన కార్తికేయ 2, సీతారామం, బింబిసార సూపర్ హిట్ అయ్యాయని.. వాటి కలెక్షన్స్ గురించి గుర్తుచేసుకుంది. 2019 నుండి లైగర్ కోసం కష్టపడ్డామని, ఎన్నో అడ్డంకులు దాటి థియేటర్లలో విడుదల చేశామని వాపోయింది. కానీ లైగర్ ఫెయిల్ అవ్వడం బాధగా ఉందని బాధను బయటపెట్టింది ఛార్మీ. 

Tags:    

Similar News