సీసీసీ ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా టీకా : చిరంజీవి
కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కోవిడ్ టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు మెగాస్టార్ చిరంజీవి.;
కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కోవిడ్ టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు మెగాస్టార్ చిరంజీవి. గత లాక్‌డౌన్‌లో సీసీసీ ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేశామన్నారు. అందులో ఇంకొంత మొత్తం మిగిలి ఉందని తెలిపారు. దాంతో సినీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు టీకా ఇప్పించాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు చిరంజీవి. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'వైల్డ్‌డాగ్' ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్నీ వెల్లడించారు.