Chiranjeevi: 'బ్రహ్మాస్త్ర' సినిమాకు చిరు సాయం.. డైరెక్టర్ ఎమోషనల్ నోట్..

Chiranjeevi: చిరంజీవి బ్రహ్మస్త్రంకు వాయిస్ ఓవర్ అందించడంతో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశాడు.

Update: 2022-06-13 10:23 GMT

Chiranjeevi: ఓ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయినప్పుడు.. ఆ సినిమాను వేరే భాషల ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలంటే కూడా చాలా కష్టపడాలి. అందుకే ఆయా పరిశ్రమల నటీనటులను సాయం అడుగుతుంటారు మేకర్స్.. అలాగే రణబీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' కోసం చిరంజీవిని సాయం అడిగాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. దానికి చిరు కూడా ఒప్పుకున్నారు.

రణభీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, ఆలియా భట్.. లాంటి భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రమే బ్రహ్మాస్త్ర. ఈ సినిమానే తెలుగులో బ్రహ్మాస్త్రంగా విడుదల కానుంది. అయితే ఈ మూవీకి తెలుగులో వాయిస్ ఓవర్ చెప్పమని చిరును కోరగా ఆయన కూడా వెంటనే ఒప్పుకొని వాయిస్ ఓవర్‌ను అందించారు. ఈ వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తమ రిక్వెస్ట్‌ను చిరంజీవి మన్నించి బ్రహ్మస్త్రంకు వాయిస్ ఓవర్ అందించడంతో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశాడు. 'నేను చిరంజీవి గారిని కేవలం రెండు సందర్భాల్లో కలిశాను. ఒకసారి రణబీర్‌తో కలిసి తెలుగులో బ్రహ్మస్త్రకు వాయిస్ ఓవర్ చెప్పమని అడగడానికి, మరోసారి కొన్నిరోజుల క్రితం ఆయన ఐకానిక్ వాయిస్‌ను రికార్డ్ చేసినప్పుడు.'

'మెగా ఎనర్జీ కలిగిన మెగాస్టార్ ఆయన. ఆయన బ్రహ్మాస్త్ర గురించి చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఈ ప్రయాణంలో ఆయనను కలుసుకోవడం ఆనందంగా భావిస్తున్నాను. ఎంతో గౌరవంతో చిరంజీవి గారు బ్రహ్మాస్త్రకు వాయిస్ ఇస్తున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆయనతో కలిసి డబ్ స్టూడియోలో ఉండడం, ఆయన వాయిస్‌ను ట్రైలర్‌లో వినడం బ్రహ్మస్త్రలోని నా ఫేవరెట్ క్షణాలు' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అయాన్. ఇక బ్రహ్మాస్త్రం తెలుగు ట్రైలర్ జూన్ 15న రిలీజ్ అవుతుంది.


Tags:    

Similar News