Chiranjeevi: ఆ విషయంలో అమితాబ్‌తో పోటీపడిన చిరు.. మెగాస్టార్‌కే మొదటి స్థానం..
Chiranjeevi: చిరంజీవి ఊరికే హీరో అయిపోలేదు. మాస్ ఇమేజ్ ఎలివేట్ అవడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. అతను కథలను వదల్లేదు.;
Chiranjeevi: చిరంజీవి ఊరికే హీరో అయిపోలేదు. మాస్ ఇమేజ్ ఎలివేట్ అవడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. అతను కథలను వదల్లేదు. ఆ సెలక్షన్ లో మిస్టేక్స్ లేకపోవడం వల్లే అతను టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. అతను ఎంచుకున్న సినిమాల్లోని కథలే.. అతన్ని బిగ్గర్ దన్ బిగ్ బి అనే స్థాయి హీరోను చేశాయి.. ఈ విషయంలో మాస్ హీరోలు కావాలనుకునే కుర్ర హీరోలు చిరంజీవి పాత సినిమాలు పెట్టుకుని చూస్తే.. అతను ఎందుకు మెగాస్టార్ అయ్యాడో అర్థమౌతుంది.
తెలుగులో అప్పటివరకు ఎన్‌టీఆర్, ఏఎన్నార్, కృష్ణలాంటి ఎంతోమంది హీరోలు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు సినిమా ఖ్యాతిని గణనీయంగా పెంచారు. ఇక వారి తరంలో ఈ ఖ్యాతిని కాపాడేది ఎవరా అనుకుంటుండగానే చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎన్నో అవమానాలు భరించి హీరో అయ్యారు. ఆ తర్వాత ఆయనలో ఉన్న కళే తనను ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇక అప్పట్లో చిరంజీవి క్రేజ్ ఏంటో తెలియాలంటే వైరల్ అవుతున్న ఓ మ్యాగజిన్ కవర్ ఫోటో చూస్తే అర్థమవుతుంది.
తెలుగులో రూ.1 కోటికి పైగా పారితోషికం అందుకున్న మొదటి హీరో మెగాస్టార్. అప్పటికీ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అంత రెమ్యునరేషన్ అందుకోలేదు. ఇదే విషయాన్ని 'ది వీక్' అనే మ్యాగజిన్ ప్రస్తావించింది. 1992 సెప్టెంబర్ 13న 'బిగ్గర్ దాన్ బచ్చన్' అనే క్యాప్షన్‌తో ఈ మ్యాగజిన్.. చిరంజీవిపై ఓ కవర్ స్టోరీ రాసింది. ఇప్పటికీ ఈ కవర్ ఫోటోను చూస్తూ చిరంజీవి అభిమానులు మురిసిపోతుంటారు. దీంతో పాటు ఎన్నో ఇంగ్లీష్ మ్యాగజిన్లు అప్పట్లో చిరుపై కథనాలు ప్రచురించాయి.
CHIRANJEEVI born on this day pic.twitter.com/TQUcIbgfk1
— Film History Pics (@FilmHistoryPic) August 22, 2022