Cinema: మంచుకొండల్లో చిల్ అవుతోన్న హీరో

ఒంటరిగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం, వేసవికి దూరంగా హిమాచల్ ప్రదేశ్ ట్రిప్;

Update: 2023-03-06 07:15 GMT

వినరో భాగ్యము విష్ణు కథతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన కిరణ్ అబ్బవరం సక్సెస్ ను సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు చక్కా ఫ్లైట్ ఎక్కేశాడు. మంచు కొండల్లో సేదతీరుతూ మెక్స్ ఫిల్మ్ కు కావాల్సినంత ఎనర్జీని మూటగట్టుకుంటున్నాడు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో వేసవికి, రొటీన్ హడావిడికి దూరంగా చిల్ అవుతున్నాడు. ఇటీవలే అబ్బాయి ట్రిప్ నుంచి విడుదలైన ఫొటోలు ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇస్తున్నాయి అనడంలో సందేహమేలేదు.  వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలో కిరణ్ పాత్రకు మంచి స్పందన లభించింది. అందరికీ అయినవాడిగా అబ్బాయి నటన సూపర్బ్ అంటూ విమర్శకులు కూడా ప్రసంశలు కురిపిస్తున్నారు. మరి రెట్టించిన  ఉత్సాహంతో తిరిగి వచ్చాక కిరణ్ మరింత స్పీడ్ పెంచుతాడేమో చూడాలి. 

Tags:    

Similar News